తెలుగు అక్షరాలు - Telugu Aksharaalu

'తెలుగు అక్షరాలు' బృంద సభ్యులకు ప్రత్యేక విజ్ఞాపన...

1) తెలుగు ...భాషాభిమానులు మరియు అంశం ఏదైనా తెలుగులోనే సందేశాలు, వ్యాఖ్యలు, వ్యాసాలు (వగైరా) వ్రాయగలిగిన వారు మాత్రమే ఈ బృందంలో కొనసాగండి. (ముఖ్యమైన జతపరుపు [అటాచ్మెంట్స్] మరియు పంపకపు [షేరింగ్] అంశాలు కూడా సాధ్యమైనంత వరకు తెలుగులో, లేక తెలుగు మరియు ఇంగ్లీష్ లో వుండేలా చూడండి)

2) కేవలం ఇంగ్లీష్ లోనే వుండే తపాలు అనుమతించబడవు (అప్రూవ్ కాబడవు). అలాంటి తపాలు ఎట్టి సూచనా లేకుండా తొలగించ బడతాయి. అన్ని భాషల తపాల కొరకు మనదే మరో బృందం 'సఖ్య వేదిక' వుంది. ఇంగ్లీష్ తపాలు అందులో పెట్టవచ్చు.

3) ఈ 'తెలుగు అక్షరాలు' బృందంలో చేరాలని అభ్యర్ధన చేసిన అందరిని (దాదాపుగా) అంగీకరిస్తున్నాం. స్వాగతిస్తున్నాం. అయితే "ఎదిగిన కొద్దీ ఒదగాలి!" (సాటి వారితో మర్యాదగా వ్యవహరించాలి) అన్న తత్వం ఒంటబట్టని మరియు బృంద విధివిధానాలు నచ్చని/పాటించలేని సభ్యులు మాత్రం వెంటనే ఈ బృందం నుండి తమంతట తామే వైదొలగడం మంచిది.

4) ఈ బృందానికి నా తోపాటు గౌరవ మిత్రులు శ్రీ నందిరాజు రాధాకృష్ణ, శ్రీ పి.వి.ఆర్. మూర్తి (పొన్నాడ మూర్తి), శ్రీ రాజేంద్రకుమార్ దేవరపల్లి మరియు శ్రీమతి రమణి రాచపూడి గార్లు ప్రథాన నిర్వాహకులుగా, మరికొందరు ముఖపుస్తక మిత్రులు సహ నిర్వాహకులుగా వున్నారు. వారి సలహాలు, సూచనలతోనే బృందం ఎదుగుతోంది. నిర్వాహకుల పట్ల గౌరవము లేక, వారంటే ఇష్టం లేనివారు తక్షణం ఈ బృందాన్ని విడనాడండి.

5) మాటల కుమ్మలాటలు, వక్తిగత దూషణలు, బూతు పదజాలాలు ఈ బృందమందు పూర్తిగా నిషిద్దం. మీకు నచ్చని అంశాలు వుంటే వాటి జోలికి వెళ్లకండి. మీకు మిత్రులు కాని సభ్యుల తపాలపై ఇష్టమొచ్చిన తీరున వ్యాఖ్యలు చేసినప్పుడే వివాదాలు మొదలవుతాయి. కనుక ఎవరి తపాల మీదైనా కాస్త మందువెనుక ఆలోచించి (మరీ ముఖ్యంగా మిత్రులు కాని సభ్యుల తపాలపై) వ్యాఖ్యానించండి.

పై విధివిధానాలకు భిన్నంగా వ్యవహరించే వారిని ఎట్టి సూచనా లేకుండా 'తెలుగు ఆక్షరాలు' బృందం నుండి తొలగించే హక్కును నిర్వాహకులు కలిగి వుంటారు. దయవుంచి సభ్యులు పై అంశాలను దృష్టిలో వుంచుకుని, తమ అక్షర సంపదతో తెలుగు అక్షరాలను సుసంపన్నం చేయవలసినదిగా ప్రార్థిస్తున్నాను.

భవదీయ

-వేమారెడ్డి మధుసూదన్ రెడ్డి (సిప్ట్ మామాట)

*********************************************************

గమనిక:

మీరు తెలుగు కీ-బోర్డ్
www.lekhini.org ఉపయోగించుకోవచ్చు

లేఖిని (Lekhini) — Type in Telugu
www.lekhini.org
A Telugu Script Generator that converts RTS input to Unicode

అలాగే గూగుల్ టూల్ http://translate.google.com/?sl=te#te/en ఉపయోగించ వచ్చు.

నేరుగా టైప్ చేసుకునేందుకు వీలుగా, తెలుగు ఇంగ్లీష్ అక్షరాలు వున్న కీ-బోర్డ్ కావాలంటే www.suravara.com ను సంప్రదించండి.